telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో వచ్చేసిన ఎడ్ సెట్ నోటిఫికేషన్…

exam hall entrence

ప్రస్తుతం తెలంగాణలో కరోనా పంజా విసురుతుంది. దాంతో రాష్ట్రంలో పాఠశాలలను ఇప్పటికే మూసేసిన ప్రభుత్వం. 10 వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేసింది. కానీ ఈ సమయంలో తాజాగా ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుద‌లైంది. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవ‌కాశం క‌ల్పించారు.. ఇక‌, ఆగ‌స్టు 24, 25 తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. 150 మార్క్ లకు ప్రశ్నలకు 2 గంటల సమయం కేటాయించారు.. సబ్జెక్టులో 60 మార్కులు (సైన్స్ 20 మార్క్స్, సోషల్ 20 మార్క్స్, మాథ్స్ 20 మార్క్స్).. సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు 10 వ తరగతి.. అంత లోపు తరగతుల సిలబస్ నుండి మాత్రమే ఉంటాయి.. టీచింగ్ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్, కంప్యూటర్ అవేర్ నెస్ 20మార్క్స్, జనరల్ నాలెడ్జి , విద్యా అంశాలు 30, జనరల్ ఇంగ్లీషు 20 మార్కులు ఉండ‌బోతున్నాయి. చూడాలి మరి ఈ పరీక్షా అయిన జరుగుతుందా… లేదా కరోనా కారణంగా ఆగిపోతుందా అనేది.

Related posts