telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడు..

కాంగ్రెస్ సీనియర్ నేత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఆగరహం వ్యక్తం చేసారు. అయితే తాజాగా మిడిటహో మాట్లాడిన ఆయన నాగార్జున సాగర్ సహా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్ ల పుణ్యమే మనమందరం అన్నం తినగలుగుతున్నాము అని అన్నారు. ఐకేపీ సెంటర్లు నెలకొల్పి మద్దతు ధర ఇచ్చి దళారుల చేతుల్లో రైతులు  మోస పోకుండా కాపాడింది కాంగ్రెస్ పార్టీ. కానీ కేంద్ర చట్టాల వల్ల మద్దతు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉండదు. దాంతో వచ్చే నష్టాలను తట్టుకొని రైతు నిలబడలేడు , భూమిని అమ్ముకోవడమో లేదా ఊరినీ వదిలిపెట్టి పోవల్సి వస్తుంది. అంతేకాకుండా మహిళలు, రైతులకు రెండు విధాలుగా ఉపయోగపడే కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తా అంటున్నాడు కేసీఆర్. సబ్సిడీతో పనిముట్లు, వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, మద్దతు ధర లేకుండా చేసి ఇచ్చే  రైతు బందుతో లాభం లేదని రైతులు చెప్తున్నారు. కేసీఆర్ విధానాల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు అని పేర్కొన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. రుణమాఫీ హామీలనీ అమలు చేయకపోవడంతో రైతు రుణ భారం పెరిగిపోతోంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తరువాత మోసం చేయడం కేసీఆర్ నైజం అని భట్టి విక్రమార్క తెలిపారు. చూడాలి మరి దీనికి తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts