telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా బాధితుల ఇంటికే ‘ఐసోలేషన్ కిట్’

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అవసరమైన ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లను ‘ఐసోలేషన్ కిట్’ పేరుతో ఉచితంగా వారింటికే సరఫరా చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికిపైగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే హోం ఐసోలేషన్ కిట్‌లో శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు, పారాసెటమాల్, యాంటీ బయాటిక్స్, విటమిన్ సి, ఈ, డీ3 ట్యాబ్లెట్లు, లివోసెట్రిజన్, ఎసిడిటీని తగ్గించే మాత్రలతో పాటు వాటిని ఎలా వాడాలో తెలిపే పుస్తకం కూడా ఉంటుంది.17 రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేలా అవసరమైన వస్తువులు, ఔషధాలను కిట్‌లో ఉంచి సరఫరా చేయనుంది.

Related posts