telugu navyamedia
రాజకీయ వార్తలు

సుజనా ఆస్తుల వేలానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్దం!

4 directors arrested from sujana chowdary offices

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధమైంది. 2018 లో రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై తీసుకున్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి సంస్థ సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. అసలు, వడ్డీ కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి రుణం రూ.400.84 కోట్లకు చేరింది.

తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు గురువారం నోటీసు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో బిడ్‌ల దాఖలుకు తుది గడువు మార్చి 21గా పేర్కొంది. ఈ–ఆక్షన్‌ విధానంలో ఆస్తులను మార్చి 23న 11.30 నుంచి 12.30 గంటల మధ్య వేలం వేస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడిచింది.

Related posts