telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్ డౌన్ తర్వాత ప‌ర్యాట‌క‌రంగానికి పూర్వ వైభ‌వం

క‌రోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో లాడ్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో పలు రాష్ట్రాల్లోని చారిత్ర‌క ప్ర‌దేశాల‌న్నీ మూత‌ప‌డ్డాయి. దీంతో టూరిజం నిమిత్తం వచ్చే సంద‌ర్శ‌కులు లేక‌పోవ‌డంతో న‌ష్టం వాటిల్లుతోంది.

అసోంలో లాక్ డౌన్ కార‌ణ‌గా ప‌ర్యాట‌క శాఖకు తీవ్ర‌న‌ష్టం వాటిల్లింద‌ని అసోం ఫారెస్ట్ మినిస్ట‌ర్ పీఆర్వో శైలేంద్ర పాండే అన్నారు. ప‌ర్యాట‌కం అధికంగా ఉండాల్సిన టైంలో ఆదాయం నిలిచిపోయింది. లాక్ డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత తాము ప‌ర్యాట‌క‌రంగానికి మ‌ళ్లీ పూర్వ వైభ‌వం తేవ‌డంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

Related posts