telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ ..

రేపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన పర్యటించనున్నారు. అకాల వర్షాల వల్ల పాడైపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు. పంట పొలాలను స్వయంగా పరిశీలించి.. రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.

ఇవాళ జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కరోనా కట్టడితో పాటు పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా అకాల వర్షాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో..ఆ జిల్లాలో పర్యటించి.. పంట నష్టాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ, తర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇక మున్సిపల్‌, పంచాయతీ రాజ్ శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ టీకా టార్గెట్‌ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. అన్ని జిల్లాల మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లతో రివ్యూ నిర్వహించాలని ఆదేశించారు.

హన్మకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటన సాగనుంది. ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరిగిన విషయాన్ని జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎకారకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకూ పెట్టబడులు పెట్టామని.. అకాల వర్షం చావుదెబ్బ కొట్టిందని రైతులు వాపోతున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాల దగ్గరకు వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి.

Related posts