telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ…

ఈరోజు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం కాబోతున్న‌ది. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేబినెట్ స‌మావేశం అవుతుంది. లాక్‌డౌన్‌, గోదావ‌రి నీటి ఎత్తిపోత‌, వానాకాలం సాగుపై చ‌ర్చించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రైతులు పంట‌లు వేసేందుకు సిద్దం అవుతున్నారు. రైతుల‌కు సంబందించి కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది. జూన్ 20వ తేదీతో లాక్‌డౌన్ స‌మ‌యం ముగియ‌నున్న‌ది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో లాక్‌డౌన్ పై కూడా రేపు కేబినెట్‌లో స‌మావేశంలో చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే రాష్ట్రంలో కేసులు, మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది.

Related posts