*ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు..
*అశోక్‌బాబుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణకు అనుమతించింది.
పదోన్నతి కోసం నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ విద్యార్హతలను చూపించారన్నఆరోపణలపై గురువారం రాత్రి ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ అధికారులు ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు తరలించారు.
అయితే అశోక్ బాబు అరెస్టును టీడీపీ నేతలు ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపిస్తున్నారు.
జగన్ నామినేషన్లు కూడా తెలంగాణలోనే వేస్తారా?: లోకేశ్