telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ శాంతిస్తోంది.. క‌రోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 మందికి వైరస్​ సోకింది.

తాజాగా క‌రోనా మ‌హ‌మ్మారితో మరో 657మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,407 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్​ కేసులు 1.64 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.17 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మ‌రోవైపు దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర్ర‌క్రియ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది. కొత్తగా 48,18,867 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,79,51,432 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Related posts