telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

తెల్ల గుడ్డు తినాలా.. పచ్చ గుడ్డు తినాలా.. !

which part of boiled egg is healthy

అందరికి పౌష్ఠిక ఆహారం లభించి ఆరోగ్యంగా ఉండాలని, గుడ్డును శాకాహారంగా ప్రకటించింది ఆరోగ్య శాఖ. రోజు ఒక్క గుడ్డు తింటే ఆ రోజుకు కావాల్సిన పోషకాలు అందినట్టేనని అంటున్నారు వైద్యులు కూడా. అయితే కొందరు మాత్రం ఈ గుడ్డు తినడంలో కూడా పై తెల్లని పదార్థం తినాలా.. లోపలి పచ్చని పదార్థం తినాలా.. అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో కూడా భిన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మాట నిజం. వారివారి శరీర అవసరాల మేరకు కొందరికి తెల్లపొర, మరికొందరు పచ్చటి పదార్థం తినాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అసలు ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందామా.. ఉడకబెట్టిన కోడి గుడ్డు ఎంత లాభాకరమో మనందరికీ తెలిసిందే. కాని చాలామందికి ఇప్పటికి అర్థం కాని విషయం ఏమిటంటే, ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఏ భాగం మంచిది ? రెండు తినడం మంచిదేనా ? ఎగ్ వైట్, ఎల్లో.. రెండిట్లో ఏది బెట్టర్ ? రెండిట్లో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతుంది ?

రెండిటి న్యూట్రిషన్ వాల్యూస్ చెక్ చేస్తే, తెల్లభాగం లో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, పసుపు భాగంలో 2.7గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే వైట్ లోనే ప్రోటీన్లు ఎక్కువ. వైట్ లో కేవలం 0.05 గ్రాముల ఫ్యాట్ ఉంటే, ఎల్లోలో మాత్రం 4.5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. వైట్ లో కేవలం 16 కాలరీలు ఉంటాయి, కాని ఎల్లోలో 54 కాలరీలు ఉంటాయి. కొలెస్టరాల్ వైట్ లో సున్నా . కాని ఎల్లోలో మాత్రం 211. కాల్షియం ఎల్లో లోనే ఎక్కువ. అలాగే ఫాస్ ఫరస్ కూడా. పొటాషియం, సోడియం, రిబో ఫ్లవిన్ వైట్ లో ఎక్కువ ఉంటే, జింక్, సేలేనియం, థియామిన్, ఫోలేట్, బి 12 ఎల్లో లో ఎక్కువ ఉంటాయి. విటమిన్స్ కూడా ఎల్లోలోనే ఎక్కువ.

which part of boiled egg is healthyమనిషి శరీరానికి ఈ న్యూట్రిషన్ రెండు అవసరమే. రెండింట్లో మనకు లాభాలు చేకూర్చే ఎలిమెంట్స్ ఉన్నాయి … కాని ఎల్లోని ఎక్కువ తినొద్దు అని ఎందుకు అంటారంటే … ఎల్లో లో కొలెస్టరాల్ లెవల్స్ ఉండటం వలన, ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం వలన, దానితో పాటు వైట్ కన్నా ఎక్కువ కాలరీలు ఉండటం వలన. ఒకవేళ అధిక బరువు సమస్య ఉన్నవారు ఉన్నారండుకోండి . అలాంటివారు గుడ్డులో కేవలం వైట్ తీసుకుంటే సరిపోతుంది.

ఎల్లో తీసుకోవాలా వద్ద అనేది వారి డైట్ బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక కొలెస్టరాల్ సమస్యతో ఇబ్బందిపడేవారు ఎల్లోని తీసుకోకపోవడమే మంచిది.

ఏ సమస్యలు లేని వారు తమ డైట్ లోకి ఉడకబెట్టిన గుడ్డుని చేర్చుకోవాలంటే … వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పూర్తి గుడ్డుని తిని, మిగితా రోజులు కేవలం వైట్ తో కానిచ్చేస్తే మంచిది అని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు.

Related posts