telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జైలు నుంచి ప‌ట్టాభి విడుద‌ల‌..

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత అధికారి ప్ర‌తినిధి పట్టాభి రామ్ విడుదల అయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిని బుధ‌వారం రాత్రి 10 గంట‌లకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో తొలుత మచిలీపట్నం జైలుకు తరలించారు. ఇక అటునుంచి అతడిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు అధికారులు.

TDP Leader Pattabhi to Machilipatnam Jail - Sakshi

దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఏపీ పోలీసులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. క్రింద కోర్టు మేజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాలని.. ఎలా పడితే అలా ప్రొసీజర్ లేకుండా చేస్తారా అంటూ జడ్జీ పోలీసులపై ధ్వజమెత్తారు.

కాగా.. మూడు రోజుల క్రితం అరెస్ట్ అయిన ప‌ట్టాభి రామ్‌ రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలై విజయవాడకు బయలుదేరారు. మీడియాతో మాట్లాడేందుకు పట్టాభి నిరాకరించారు.

Related posts