telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 24, ఆదివారం రాశిఫ‌లాలు..

మేష రాశి
మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తము ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోతాయి. కొత్తలనులను ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవదర్శనాలు చేస్తారు.

వృషభ రాశి
ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొత్త వస్తు, నగలు కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల్లో అద్భుతమైన విజయం సొంతం చేసుకుంటారు. చేసిన అప్పులు తీరుస్తారు.మిత్రులను కలుసుకుంటారు.

మిధున రాశి
దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మనోధైర్యం కోల్పోకుండా తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. మాట తీరుతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.

కర్కాటక రాశి
కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని ఇస్తాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు లాభదాయకం. పట్టుదలతో చేపట్టిన కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు. వృత్తిరిత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి
మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు లబిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి.

కన్య రాశి
తల పెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తలెత్తుతాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తపనులు చేపట్టేవారు వాయిదా వేసుకోవడం మంచిది.కుటుంబీకుల కోసం ధనం బాగావ్యయం చేస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు.

తులా రాశి
ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసలుబాటు ఉంటుంది. కుటుంబంలో కలతలలు ఏర్పడే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు నెరవేరతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మసులు కోవడం మంచిది. చెడు సహవాసాలకు దూరంగా ఉండడం శుభప్రదం.అనారోగ్య బాధలు అధికమవుతాయి. ప్రయాణాల్లో పాత మిత్రులు, అయిన వారు తారసపడతారు. 

వృశ్చిక రాశి
స్త్రీల మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేస్తారు. వ్యవసాయం వలన లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి.

ధనుస్సు రాశి
రాజకీయనాయకులకు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్త్రీల వలన లాభం పొందుతారు. రుణబాధలు తొలగిపోతాయి. . ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంటుంది.

మకర రాశి
ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు.. ఆకస్మిక ధన లాభం పొందుతారు. సంతోషంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. బంధు మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ‌వుతుంది.

కుంభ రాశి
స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. క్రీడాకారులకు, రాజకీయ రంగంలోని వారికీ మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి. కొత్త పనులు చేపట్టడం వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవాకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబంలో చికాకులు.

మీన రాశి
స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో చికాకులు అధికం. చేపట్టిన పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. అద్భుత శక్తి సామర్ధ్యాలతో పనులు పూర్తి చేస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

 

Related posts