ఏపీ ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 2 వరకు ఆన్సర్ పేపర్‌ల రీకౌంటింగ్, రీవాల్యువేషన్ అవకాశం కల్పించారు.
రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే వారు పేపర్‌కు రూ.260, స్కాన్ కాపీ, రీవాల్యువేషన్ కోసం పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు.
ఇక..విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘[email protected]’’ ద్వారా లేదా 391282578 వాట్సాప్ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.