టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఉన్న పాత కేసులు తవ్వడం వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని చంద్రబాబు ఖండించారు.
ఇవాళ ఎమ్మెల్యే కరణం బలరామ్ పై, నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై, మొన్న కూన రవికుమార్ పై వైసీపీ అక్రమ కేసులు బనాయించిందని నిప్పులు చెరిగారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడీపై పోరాడితే, ఇప్పుడు కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. వందలాది మంది కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.