telugu navyamedia
రాజకీయ

కశ్మీర్ పై పడి ఏడవటాన్ని పాకిస్థాన్ ఆపేయాలి: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh inaugurates NIA office

కశ్మీర్ పై పడి ఏడవటాన్ని పాకిస్థాన్ ఆపేయాలని పై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లడాఖ్ లో రాజ్ నాథ్ తొలిసారి పర్యటించారు. అక్కడ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసర్చ్ నిర్వహించిన 26వ ‘కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కశ్మీర్ వారిది ఎప్పుడయిందో చెప్పాలని ఎద్దేవా చేశారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చోటుచేసుకుంటున్న మానవహక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ మాట్లాడాలని సూచించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ మొదట కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నించారు. పాక్ తో మంచి సంబంధాలనే భారత్ కోరుకుంటోందని చెప్పారు. జమ్ముకశ్మీర్ విషయంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా పాకిస్థాన్ కు మద్దతును ప్రకటించలేదని అన్నారు. కశ్మీర్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగమేనని రాజ్ నాథ్ తేల్చి చెప్పారు.

Related posts