సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన చిత్రం “టాక్సీవాలా”. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్. ఈ బ్యూటీ “టాక్సీవాలా” చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ చిత్రంలో ప్రియాంక నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ అంతేకాకుండా ఈ సినిమా హిట్ అయినప్పటికీ ప్రియాంకకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత మరో సినిమాకి సైన్ చేసేందుకు చాలా టైం తీసుకుంది. తాజాగా ఈ అమ్మడు సృజన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సైన్ చేసిందట. ఇందులో శివ కందుకూరితో జత కట్టేందుకు ప్రియాంక జవాల్కర్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుండగా, ఇందులో ప్రియాంక ముస్లిం యువతి పాత్రలో కనిపించి కనువిందు చేయనుందట. జ్ఞాన శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రియా శరన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మరి చూడాలి ఈ సినిమాతోనైనా ప్రియాంక స్పీడ్ అందుకుంటుందేమో.
previous post
“ఒక్కరే మహానటి కాదు” జయసుధ కామెంట్స్… హీరోలపై టియస్సార్ సెటైర్లు