telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్లాష్ : సోనూ సూద్ కు నెగెటివ్

సోనూ సూద్ కు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో సోనూ సూద్ కు నెగిటివ్‌గా నిర్దారణ అయింది.సోనూ సూద్ ‌కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో… ఆయన త్వరగానే కోలుకున్నారని తెలుస్తోంది.  సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. నిజానికి కొద్ది రోజుల ముందు సోనూసూద్ కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అనే రిపోర్ట్ రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న సోనూ అభిమానులు కోట్లాది మంది ఆవేదన చెందారు.  కాగా ఏప్రిల్ 17 న సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అని సోనూసూద్ కోరారు. ఇది ఇలా ఉండగా కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ సూద్ చేసిని సహాయం మరువలేనిది. ఎందరో వలస కార్మికులను ఇల్లకు చేర్చారు. విదేశాలలో చిక్కుపోయిన వారిని స్వదేశానికి రప్పించారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో మొదలు పెట్టిన సహాయాన్ని సోనూసూర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 

Related posts