అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడింది. కొన్నిరోజులుగా చైతూ, సాయి పల్లవిల మూవీ విడుదల విషయంలో చిత్ర యూనిట్ తేల్చుకోలేకపోతోంది.
గతంలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. థియేటర్ల సమస్యల పరిష్కారంలో స్పష్టత లేకపోవడంతో సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అప్పట్లో థియేటర్లలో నాలుగు షోలు వేసినప్పుడే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ స్పష్టం చేసింది.
లవ్ స్టోరీ సినిమా విడుదలపై దీంత లవ్ స్టోరీ సినిమా విడుదల పై విభిన్న రకాలుగా టాక్ వినిపించింది. అన్నింటికి చెక్ పెడుతూ లవ్ స్టోరీ వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. కానీ తాజాగా ఈ సినిమా విషయంలో మరోసారి మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
చూస్తుంటే.. ఏపీలో థియేటర్ల సమస్యల పరిష్కారంలో పురోగతి లభించలేదు. దాంతో మూవీ రిలీజ్ వాయిదా వేయడమే బెటర్ అనుకుంది చిత్ర యూనిట్.. సో మళ్లీ లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పటికే కరోనా కారణంగా మూవీ వాయిదా పడింది.