telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్‌తో తమన్నా రొమాన్స్‌ !

సంక్రాంతి కనుకనే విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ లాయర్ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు నెటిజన్లతోపాటు, సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కే టీకా వేస్తాడు పవన్ అంటూ సెలెబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా వకీల్‌పాబ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. వకీల్‌సాబ్ సినిమా హిందీ పింక్ సినిమాకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ఈ సినిమాకి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించారంట. చిత్ర యూనిట్ ఎన్నింటిని జోడించిన ప్రేక్షకుల ఊహలను అందుకోలేక పోతున్నాట్లు అనిపించడంతో చిత్ర యూనిట్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ పాటకు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డాన్స్ చేయనున్నాట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. తమన్నా ఇదివరకే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సరిలేరు నీ కెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. అంతే ఈ సినిమాలో కూడా తమన్నా స్పెషల్ పాట చేయనున్నారని అంటున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts