telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో సినిమాను ప్రారంభించిన శ్రీవిష్ణు…

బ్రోచెవారెవరురా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. పెద్ద స్థాయి హీరో కాకపోయినా తన స్థాయిలో మంచి కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకటే కథ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ 36 ఏళ్ల నటుడు 2009లో బాణం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సోలో, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ ఇలా ఎన్నో సినిమాలలో తన ప్రతిభను కనబరిచి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం శ్రీవిష్ణు వరుస సినిమాలకు ఓకే చెప్తూ మంచి జోరు చూపిస్తున్నాడు. నేడు అతడి నూతన సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది. దీనిని నామమాత్రపు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకి నారా రోహిత్ క్లాప్ కొట్టి మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రదీప్ వర్మ అల్లూరి డైరెక్ట్ చేయనున్నాడు. శిరీష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి ప్రజాదరణ పొందుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. మరి చూడాలి ఈ సినిమా ప్రజలను ఆకట్టుకుంటుందా… లేదా అనేది.

Related posts