telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ “ఆదిపురుష్”పై రాజమౌళి స్పందన

Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్క‌నున్న‌ట్టు ప్రకటించారు. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలయిన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక ‘బాహుబలి’తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ఈ సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ గురించి నాకు ముందే తెలుసు. పోస్టర్‌ను నేను అందరి కంటే ముందు చూశాను. అద్బుతంగా ఉంది. రాముడి పాత్రకు ప్రభాస్‌ సరిగ్గా సెట్‌ అవుతాడు. ప్రస్తుతం అయోధ్యలో మందిరం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం. దేశమంతటా రాముడి గురించి చర్చ జరుగుతున్న సమయంలో రాముడిపై సినిమా వస్తే మరింత బాగుంటుంది. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచుతుంది. ఈ సినిమా కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నాను’ అన్నారు జక్కన్న

Related posts