మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. నేడు ప్రీ-రిలీజ్ వేడుక జరుపుకుంటుంది ఈ చిత్రం. ఈ చిత్రం భారతదేశ తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం సైరా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా 125 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. జీ టీవీ ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అంతేకాదు.. అమేజాన్ కూడా ఈ చిత్రాన్ని 40 కోట్లకు కొనుగోలు చేసారని తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 100 థియేటర్లలో సైరా ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 250 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.