telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ప్రాంక్స్ చేసిన విద్యార్థుల .. అరెస్ట్..

students ghost prank arrested

ఇటీవల రోడ్డుపైకి వచ్చి ప్రాంక్స్ చేయడం సర్వసాధారణం అయ్యింది. ప్రతిదానికి రెండు ప్రయోజనాలు ఉన్నట్టుగా, వీటితో కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టే, దుష్ఫలితాలు కూడా లేకపోలేదు. ఇది చిన్న విషయంగా నే పరిగణించాలి, ఎందుకంటే, ఇలా రోడ్డుపైన చేసేవారు ఇద్దరో ముగ్గురో ఉండి ప్రాంక్స్ చేస్తుంటారు. కానీ, వీరిని చూసి ఉత్సాహం తో కొందరు గ్రూపులుగా తయారయ్యి గ్రామాలలో దెయ్యాలనే అంశాన్ని పట్టుకొని ప్రాంక్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ మధ్య ఇటువంటివి చేసి, దెయ్యాలు లేవనే విషయాన్ని ప్రజలలో బలంగా నాటాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

అంతవరకు బాగానే ఉన్నప్పటికీ, దీనిని చూసి మరో విద్యార్థి గ్రూప్ ఉత్సాహాన్ని పొంది, దెయ్యాల వేషాలు వేసుకొని రోడ్డుపై పడ్డారు. ఇష్టానికి అందరిని భయపెడుతూ, రోడ్డున వచ్చిపోయే వాహనదారులను కూడా హఠాత్ దర్శనంతో భయభ్రాంతులను చేస్తూ ప్రాంక్ చేశారు. అది చాలా మందిని ఇబ్బంది పెట్టటంతో వారిలో కొందరు పోలీసులకు పిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన అధికారులు ఆ గ్రూప్ లో ఉన్న ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. కొంతమేరకు ఇటువంటివి అన్నీ సరదాగా ఉన్నా, పరిధి దాటితే ఏదైనా ప్రమాదమే. దానిని మరిచిపోకుండా ఏ పని చేసినా అది అందరికి ప్రయోజనమే. ఇతరులకు ఇబ్బంది కలిగించటం కంటే అసలు ఏమీ చేయకపోవటమే మెలనేది పెద్దల మాట!

Related posts