telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఇంటర్ బోర్డు అవకతవకలపై కమిటీ నివేదిక

inter board telangana

తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలపై నిపుణుల కమిటీ ఈ రోజు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల వాల్యూయేషన్‌లో ఎలాంటి లోపాలు లేవని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. గతంతో పోలిస్తే రీ వాల్యూయేషన్ కోసం ధరఖాస్తులు తక్కువగా వచ్చాయని నిపుణుల కమిటీ తేల్చింది.

ఇంటర్ బోర్డులో ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న విబేధాలే దీనికి కారణమని కమిటీ తెలిపింది. 2017 లో రీ వాల్యూయేషన్ కోసం16680, 2018లో 17491 ధరఖాస్తులు వచ్చినట్టుగా నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది కేవలం 4000 ధరఖాస్తులు మాత్రమే వచ్చాయని నివేదిక తేల్చింది.టెక్నికల్ అంశాలపై ఇంకా లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడుతోంది.

ఇంటర్ పరీక్ష ఫలితాల పై బోర్డ్ వైఫల్యాన్ని నిరసిస్తూ బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడ పాల్గొన్నారు. దీంతో ఇవాళ ఇంటర్ బోర్డు ఎదుట ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

Related posts