సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం “ఎన్జీకే”. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రభు నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలని భావించారు చిత్రబృందం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మే 31న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ సినిమా విడుదలలో జాప్యం కారణంగా సూర్య అభిమానులు కాస్త నిరాశ చెందారు. తాజా అప్డేట్ తో సూర్య అభిమానులు సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
నాగబాబు కౌంటర్ పై బాలయ్య స్పందన