telugu navyamedia
సినిమా వార్తలు

జబర్దస్త్ గా సూర్య “బందోబస్త్” టీజర్

Bandobasth

స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేవీ ఆనంద్ దర్శకత్వంలో త‌మిళ స్టార్ హీరోలు సూర్య‌, ఆర్య, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌ ప్ర‌ధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం “కాప్పాన్”. ఈ చిత్రంలో ముగ్గురు ప్రముఖ హీరోలు ఉండడంతో ముగ్గురు హీరోల అభిమానులు సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్రలో కనిపించనున్నారు. అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగ‌ల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోను విడుద‌ల చేయనున్నారు. ఇటీవలే రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. “బందోబ‌స్త్” అనే టైటిల్‌తో ఈ చిత్రం తెలుగులో విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైనది. ఈ టీజర్లో సూర్య సీక్రెట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గానే కాకుండా ఒక టెర్రరిస్ట్ గా అలాగే గ్రామంలో ఒక సాధారణ యువకుడిగా కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts