telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరు” నుంచి సర్ప్రైజ్… విజయశాంతి లుక్ విడుదల

Vijaya

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “స‌రిలేరు నీకెవ్వ‌రు”. 90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా దీపావ‌ళి సంద‌ర్భంగా “స‌రిలేరు నీకెవ్వ‌రు” మూవీ నుండి విజ‌య శాంతి లుక్ విడుద‌ల చేసారు. భార‌తి పాత్ర‌లో అల‌రించ‌నుంది. ఇందులో విజ‌య శాంతి లుక్ అభిమానుల‌లో ఆస‌క్తి క‌లిగిస్తుంది. విజ‌య‌శాంతి రాయలసీమకు చెందిన పవర్ ఫుల్ లేడీ పాత్ర‌లో కనిపించ‌నున్నార‌ని భావించినప్ప‌టికి, తాజాగా విడుద‌లైన లుక్ చూస్తుంటే ఆమె పాత్ర చాలా డీసెంట్‌గా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

Related posts