telugu navyamedia
సినిమా వార్తలు

కేఏ పాల్ బ‌యోపిక్… సునీల్ కు హాలీవుడ్ మేక‌ప్ మ్యాన్ మేకొవ‌ర్

KA-Paul-and-Sunil

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో తెరపైకి వచ్చిన కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికలలో ఆయన ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. ఇక ఆయనకు క్రైస్తవ మత ప్ర‌చార‌కుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మయంలో కేఏపాల్ తన వింత చేష్టలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. పాల్ కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. తాజాగా కేఏ పాల్ బ‌యోపిక్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, కేఏపాల్‌ పాత్రలో సునీల్ కనిపిస్తాడట. ప్ర‌స్తుతం సునీల్ అమెరికాలో ఉండ‌గా ఆయ‌నకి హాలీవుడ్ మేక‌ప్ మ్యాన్ మేకొవ‌ర్ చేస్తున్నాడ‌ట‌. ఇక ఈ సినిమాలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో పాటు నార్త్ కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాన్ ఉన్‌, హాలీవుడ్ స్టార్ న‌టి ఏంజెలీనా జోలీ పాత్ర‌లు కూడా ఉంటాయ‌ట‌. వాటికి సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక కూడా జ‌ర‌గుతుంద‌ట‌. సునీల్ అమెరికా నుండి హైద‌రాబాద్ వ‌చ్చాక చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని ఇన్‌సైడ్ టాక్ . హీరో నుండి మ‌ళ్ళీ క‌మెడీయ‌న్‌గా ట‌ర్న్ తీసుకున్న సునీల్ చివ‌రిగా చిత్ర‌ల‌హ‌రిలో న‌టించాడు. ప్ర‌స్తుతం గోపిచంద్ హీరోగా తెర‌కెక్కుతుర‌న్న చాణ‌క్య చిత్రంలో న‌టిస్తున్నాడు.

Related posts