telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టెన్త్ ఎగ్జామినేషన్ పేపర్ల లీకుల వెనుక సూత్రధారులు టీచ‌ర్లే..

ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రాలు లీకవుతుండడం తీవ్ర కలకలం రేపాయి.

విపక్షాల విమర్శలు, తల్లితండ్రుల ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్ పలు జిల్లాల్లో ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టులు చేస్తోంది. టీచర్లతో పాటు ఇతర సిబ్బంది, ప్రైవేటు వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.

కాగా..ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్‌ఛార్జ్ లే దీనికి సహకరిస్తున్నట్లు గుర్తించామ‌ని SSC ఎగ్జామినేషన్ డైరెక్టర్ దేవానంద రెడ్డి అన్నారు.

ఏపీ వ్యాప్తంగా మాస్ కాపీయింగ్ కి సహకరిస్తున్న 55 మందిని అరెస్ట్ చేసామ‌ని తెలిపారు. అందులో ఎక్కువ‌మంది ఉపాధ్యాయులే వున్నారన్నారు.

పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి బాధ్యులపై విద్యాహక్కు చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.దీంతో విద్యాశాఖతో పాటు విద్యార్ధులు, ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర కలకలం రేగుతోంది.

Related posts