మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. తాజాగా శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను బుధవారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో మంత్రి రోజా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ కరోనా వల్ల రెండేళ్లు ఇళ్లకే పరిమితం అయ్యామన్నారు. క్రీడలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎదగవచ్చునని, 48 క్రీడా అంశాలలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలుగులోకి తెస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో స్పోర్ట్స్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తామన్నారు. ఎక్కడైనా క్రీడా ప్రాంగణాలు అక్రమణలకు గురై ఉంటే వాటిని సంరక్షించి, క్రీడా ప్రాంగాణలుగా అభివృద్ధి చేస్తాం అని చెప్పారు .