telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బిల్లును వ్యతిరేకించాలని ఎమ్మెల్యేకు పవన్ ఆదేశం

pawan-kalyan

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను పవన్ కల్యాణ్‌ ఆదేశించారు.

ఈ మధ్య జనసేనతో తనకేం సంబంధం లేదన్నట్లు రాపాక వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, వైసీపీతో ఆయన సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఆయన ఎవరికి మద్దతు తెలుపుతారన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీ అధినేత పవన్ ఆదేశాలను రాపాక పాటించే పరిస్థితి లేదనే తెలుస్తోంది.

Related posts