సుమ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. .వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.
పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా జయమ్మ పంచాయితీ ట్రైలర్‌ని విడుదల చేశారు. కామెడీ డ్రామాతో పాటు భావోద్వేగాలు ఉండేలా ట్రైలర్‌ని కట్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. శ్రీకాకుళం నేపథ్యంలో సుమ యాస హైలైట్ గా నిలిచింది.
ట్రైలర్ చూస్తే..‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ అంటుంది యాంకర్ సుమ. భర్తకు ఆపరేషన్ చేయించడానికి డబ్బు కోసం జయమ్మ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
ఇక ఇంతలోనే కూతురు పుష్పవతి కావడంతో ఆమెకు ఫంక్షన్ చేసి చదివింపుల ద్వారా వచ్చిన డబ్బును భర్త ఆపరేషన్ కోసం ఉపయోగించాలనుకుంటుంది. కానీ ఇంతలోనే ఒక అనుకోని సమస్య జయమ్మ పై పడుతుంది. దీంతో ఆమె తన సమస్యతో గ్రామా పెద్దల ముందు పంచాయితీ పెడుతోంది.
‘నా ఎనబైయేళ్ల జీవితంతో ఇలాంటి గొడవ వినలేదు, చూడలేదు’అని ఓ పెద్దాయన అనడం.. ‘తెల్లారికల్లా నా విషయం తేల్చలేదంటే.. ఊళ్లో ఎవరెవరైతే పెద్ద మనుషులని తిరుగుతున్నారో ఆలింటిముందే ఆళ్లకు పిండం పెట్టకపోతే సూడండి’అంటూ జయమ్మ వార్నింగ్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
అనారోగ్యంతో ఉన్న తన భర్తను ఎలా కాపాడుకుంది? చివరికి తనకు ఎదురైన సమస్యను పరిష్కరించుకోగలిగిందా?’ అనేది తెలియాలంటే మే 6న థియేటర్స్‌లో ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నాగబాబు కామెంట్స్