అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. జానూ సినిమా తరువాత సమంత నటించిన చిత్రాలేవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాగా తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సాధారణ కాటన్ దుస్తుల్లో ఉన్న తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను సమంత షేర్ చేసింది. “సాధారణంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు అసాధారణంగా మారేంత సాధారణం” అంటూ కామెంట్ చేసింది.
View this post on Instagram
Become consciously ordinary . So ordinary that you become extraordinary.