స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరైన బన్నీ కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసాడు. బ్లాక్ డ్రెస్, గుబురు గెడ్డం, మంకీ క్యాప్, గాగుల్స్‌తో స్టైలిష్ స్టార్ న్యూ లుక్ ఆకట్టుకుంటోంది. బన్నీ న్యూ గెటప్ తనకొత్త సినిమా కోసమే అని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో..’ నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయడంతో ఫుల్‌జోష్‌లో ఉన్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సుకుమార్ సినిమాకి డబుల్ ఎనర్జీతో ఎంటర్‌కాబోతున్నాడని తెలుస్తోంది. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బన్నీ నటిస్తున్న 20వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. చిత్తూరు జిల్లా నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. త్వరలో అల్లు అర్జున్ షూటింగులో జాయిన్ కానున్నాడు.
previous post