telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పోటీకీ దూరం

Speaker sumitra mahajan not contest

లోక్‌సభ స్పీకర్‌, ఇండోర్‌ పార్లమెంట్‌ సభ్యురాలు సుమిత్రా మహాజన్‌ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుమిత్రా మహాజన్‌ ఈ రోజు ప్రకటించారు. ఇండోర్‌ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆమె అడిగారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని ఆమె కోరారు.

ఇండోర్‌ నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికలు మొదలుకొని 2014 సాధారణ ఎన్నికల వరకు ఆమె ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. ఈ నెలలో సుమిత్రా మహాజన్‌ వయస్సు 76 సంవత్సరాలు నిండాయి. వయసు రీత్యా ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిని పక్కన పెట్టిన నేపథ్యంలో సుమిత్రా మహాజన్‌ను కూడా బీజేపీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Related posts