telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా నైట్ కర్ఫ్యూ…

దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. దాంతో చాలా రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తుండగా ఈ మధ్యే తెలంగాణలో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక తాజాగా ఏపీలో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పూర్తి స్థాయి సామర్థ్యం వరకు కరోనా పరీక్షలు చేపట్టాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు. అలాగే సిటీ స్కాన్ ధర సుమారుగా 2,500 గా నిర్ధారించినట్లు ప్రకటించిన ఆళ్ళ నాని ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. అయితే ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనుంది అని ఆళ్ళ నాని తెలిపారు.

Related posts