telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఇవాళ్టి నుంచే జేఈఈ మెయిన్స్…ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే !

exam hall

ఇవాళ్టి నుండి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 52వేల389 మంది హాజరు కానున్నారు. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 పట్టణాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులకు గంటన్నర ముందు నుంచే అనుమతి ఉండగా… పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. రెండు, మూడు విడతల్లో బ్యాచిరల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ను నిర్వహించడం లేదు.

Related posts