telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కేబినేట్ మీటింగ్‌లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ఏపీ కేబినేట్‌ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు చెప్పినట్లు సమాచారం

అయితే తమకు ఇదే చివరి కేబినెట్ సమావేశమా? అని కొందరు మంత్రులు అడగ్గా.. మంత్రి వర్గం నుంచి తప్పించిన వారు పార్టీ కోసం పని చెయ్యాలని జగన్ సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడున్న కొంత మంది మాత్రం మంత్రి పదవిలోనే ఉంటారని సీఎం జగన్ తెలిపారు.

చాలా మంది పోటీలో ఉన్నారన్న ముఖ్యమంత్రి.. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కన పెట్టినట్లు భావించొద్దని చెప్పారు. పార్టీని గెలిపించుకొని వస్తే మళ్లీ మంత్రులు కావొచ్చని ఆయన సూచించారు.

ఈ నెల 15న జరిగే వైఎస్సార్​సీఎల్పీ భేటీలో మంత్రివర్గ విస్తరణపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యాఖ్యలతో ఎవరికి మంత్రి పదవి ఉంటుందో ..ఎవరికి ఊడుతుందో.. అని మంత్రుల్లో చ‌ర్చానీయాంశం అయ్యింది.

Related posts