telugu navyamedia
క్రైమ్ వార్తలు

పాముతో భార్య‌ను చంపించిన భ‌ర్త‌కు రెండు జీవిత‌ఖైదు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఉత్రా’ హత్య కేసు నిందితుడైన భ‌ర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులు విధించింది కోర్టు. పాముతో భార్యను కరిపించి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన భర్తకు.. కేరళలోని జిల్లా కోర్టురెండు జీవిత ఖైదులు విధించింది.

దీంతోపాటు రూ.5.85లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించనట్లయితే అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే పాముతో కాటు వేయించినట్లు నిర్ధరణ కావడంతో ఈ కీలక తీర్పునిచ్చింది కొల్లాం జిల్లా కోర్టు. ఈ కేసులో అక్టోబర్​ 11న విచారణ ముగించిన కోర్టు.. తాజాగా శిక్షను ఖరారు చేసింది.

Uthra murder case

కేరళ కొల్లాం జిల్లాలోని అంచల్​ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్​ భార్యభర్తలు. పెళ్లి తర్వాత కొన్నాళ్లుగా బాగానే ఉన్న సూరజ్​.. తరువాత మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేయాలని పథకం రచించాడు.సురేష్​ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి విష సర్పాన్ని తీసుకున్నాడు. ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేయగా.. ఆమెను పాము రెండు సార్లు కాటువేయడంతో ఉత్రా ప్రాణాలు కోల్పోయింది.

కుమార్తె మరణంపై అనుమానం వచ్చిన ఉత్రా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరజ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలీలో విచారించి నిజాలు రాబట్టారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించాలని వాదించిన న్యాయవాది, సూరజ్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు నిందితుడుకు శిక్ష ఖ‌రారు చేశారు.

Related posts