telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మోడీ ప్రమాణ స్వీకారానికి .. సోనియా, రాహుల్ … మమతా హ్యాండ్..

sonia and rahul to modi oath ceremony

నరేంద్రమోడీ ఇవాళ(మే-30,2019) రెండవసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు,ముఖ్య అతిధులు మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకానుండగా దాదాపు 10 దేశాల నేతలు కూడా హాజరుకానున్నారు.

ఇప్పటికే వివిధ దేశాల ప్రధానమంత్రులు మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గురువారం రాత్రి 7 గంటలకు కొత్త మంత్రులతో కలసి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రధానమంత్రితో పాటు, కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. రాజ్యాంగబద్దమైన ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నాను. బెంగాల్‌లో జరిగిన రాజకీయ అల్లర్లలో 54 మంది హత్యకు గురయ్యారని బీజేపీ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వస్తుండగా చూశానని.. ఇది పూర్తిగా అబద్ధమని మమత అన్నారు. అందుకే ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నానని తెలిపారు.

Related posts