telugu navyamedia
సినిమా వార్తలు

నాన్న‌కి మీ స‌పోర్టు, ఆశీస్సులు కావాలి – అజయ్ శివశంకర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్​ కు కరోనా సోకడంతో గ‌త నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు.

తాజాగా ఆరోగ్యం పై ఆయన కుమారుడు అజయ్ శివశంకర్ మాట్లాడారు.. ఏఐజీ ఆస్పత్రిలో మాస్టర్​కు వైద్యం కొనసాగుతోందని చెప్పారు. కరోనా కారణంగా ఆయ‌న లంగ్స్‌కు చాలా ఎఫెక్ట్ అవ్వ‌డంతో వెంటిలేట‌ర్ పై ఐసీయూ వార్డ్‌లో ఉన్నార‌ని, తన అన్న కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, తల్లి ఇంట్లో ఐసోలేషన్​లో ఉన్నారని తెలిపారు

వారం రోజుల్లో ఇంట్లో ముగ్గురికి కరోనా సోకడం వల్ల చాలా డిప్రెషన్​లోకి వెళ్లినట్లు చెప్పారు అజయ్. మీ ఆశీస్సులు త‌ప్ప‌కుండా ఆయ‌న‌కు ఉండాలి, వెంటిలేట‌ర్‌పై బ‌య‌ట‌కు రావాల‌ని , అన్న‌య్య కూడా రిక‌వ‌రీ అవుతున్నాడు అన్నారు.ఈ విష‌యం తెల‌వ‌గానే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ప్ర‌ముఖులు మెగాస్టార్​ చిరంజీవి, సోనూసూద్, డాన్స్​ మాస్టర్లు లారెన్స్, జానీ సహా ఇతరులు తమకు అండగా ఉన్నట్లు తెలిపారు.

స‌హాయం చేసిన వాళ్ల అంద‌రికీ చాలా థ్యాంక్స్‌..దేవుడు ద‌య‌వ‌ల్ల నాన్న బ‌య‌ట‌కు రావాల‌ని, మీ ఆశీస్సులు, స‌పోర్ట్‌ కావాలని అజయ్ శివశంకర్ కోరారు.

Related posts