telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైరా సంచలనం .. అప్పుడే భారీ రేటుకు కన్నడ మార్కెట్…

a song on syeera on tamanna and chiru

మెగాస్టార్ చిత్రం సైరా మరోసంచలనానికి తెరలేపింది. ఇటీవలే షూట్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం అప్పుడే భారీగా బిజినెస్ చేస్తుంది. ఒక్క తెలుగు బాషలోనే కాకుండా, ఇతర భాషలలోను తన సత్తా చాటుతుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతుంది. దసరా బరిలో దిగుతున్న ఈ సినిమా బిజినెస్ టాప్ లేచిపోతుంది. సినిమా బడ్జెట్ 250 కోట్లు కాగా దానికి తగినట్టుగానే బిజినెస్ జరుగుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో సైరా బిజినెస్ గురించి ఇంకా డీటైల్స్ తెలియాల్సి ఉండగా కర్ణాటకలో మాత్రం సైరా సంచలనాలు మొదలయ్యాయి.

కర్ణాటకలో సైరా సినిమాను 32 కోట్లకు కొనేశారట. సైరా సెన్సేషన్స్ అక్కడ నుండే మొదలయ్యాయని చెప్పొచ్చు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో వస్తున్న సైరా సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తుండగా అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపై బాబు వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సైరాలో హీరోయిన్స్ నయనతార, అనుష్క, తమన్నా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

Related posts