మైక్రోసాఫ్ట్ సంస్థ తన విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్‌ను నిలిపివేయనుంది. జనవరి 14వ తేదీ నుంచి ఆ ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ఒక పోస్టులో తెలిపింది. దీంతో విండోస్ 7 ఓఎస్‌కు ఇకపై ఎలాంటి అప్‌డేట్లూ రావని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇప్పటికే విండోస్ 7 జెన్యూన్ ఓఎస్‌ను వాడుతున్న వారు ఉచితంగా విండోస్ 10కు ఆ ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని సూచించింది.
విండోస్ 7 పైరేటెడ్ వెర్షన్‌ను వాడుతున్న వారు కొత్తగా విండోస్ 10 ఓఎస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా 2009 అక్టోబర్ 22న విండోస్ 7 విడుదల కాగా, వినియోగదారుల కంప్యూటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.