telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శర్వానంద్‌ “శ్రీకారం” ఖాతాలో అరుదైన రికార్డు

యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్‌ మోహన్ హీరోయిన్ గా‌ నటిస్తోంది. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ కు తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ‘భలేగుంది బాల’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ ఫోక్ మెలోడీ సాంగ్ శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాట చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే..తాజాగా ‘భలేగుంది బాల’సాంగ్‌ ఏడు మిలియన్ల వ్యూస్‌ను సంపాదించుకుంది. ఇంత తక్కువ సమయంలో ఏడు మిలియన్ల వ్యూస్‌ రావడంతో చిత్ర యూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts