telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” చెయ్యడం ఒక లైఫ్ చేంజింగ్… కానీ… : శృతి హాసన్

Shruthi Haasan

కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సౌత్ హీరోయిన్ శృతి హాసన్. ఆమె నటి మాత్రమే కాదు… గాయని, మ్యూజిక్ కంపోజర్ కూడా. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసి అందులో తన సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తోంది. మొదట్లో టెక్నికల్ యూనిట్ తో కలిసి పని చేసిన శృతి ఆ తరువాత హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. టెక్నిషియన్ గా రాణిస్తూనే హీరోయిన్ గా మెప్పించింది. తమిళంతో పాటుగా తెలుగులో అనేక సినిమాలు చేసింది శృతి హాసన్. అయితే, వరసగా సినిమాలు చేస్తున్న సమయంలో సడెన్ గా బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైనా శృతి హాసన్ తిరిగి మాస్ మహారాజా రవితేజ సినిమా క్రాక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే శృతికి కూడా తన కెరీర్ ఆరంభంలో చేదు అనుభవాలు తప్పలేదు. తెలుగులోనే కెరీర్ ను స్టార్ట్ చేసిన అమ్మడు హిట్ అందుకోడానికి టైం పట్టింది అనేక రిమార్క్స్ నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన “గబ్బర్ సింగ్” శృతికి ఒక్కసారిగా భారీ బ్రేక్ ను ఇచ్చింది. ఇటీవలే ఒక జాతీయ స్థాయి ఇంటర్వ్యూలో తాను చెప్పని మాటలను తెలుగు, దక్షిణాది ఇండస్ట్రీలపై కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ వార్తల్లో అసలు ఎలాంటి నిజమూ లేదని శృతి క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా తెలుగు “రేస్ గుర్రం”, “గబ్బర్ సింగ్” లాంటి హిట్ చిత్రాల్లో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని, పవన్ కళ్యాణ్ గారితో “గబ్బర్ సింగ్” చెయ్యడం ఒక లైఫ్ చేంజింగ్ అని శృతి తెలిపింది. తెలుగు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ నా గుండెల్లో భాగం అని, ఆ ఇంటర్వ్యూ లో నేను చేసిన హిందీ చిత్రాల గురించే చెప్పానే కానీ… ఎక్కడా తెలుగు వర్సెస్ హిందీ అన్నట్టుగా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది.

Related posts