telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అజయ్ భూపతి “మహాసముద్రం”… ఈసారి నెగటివ్ షేడ్ లో హీరో… ?

ajay-Bhupathi

“ఆర్‌ఎక్స్ 100” సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి “మహాసముద్రం” పేరుతో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను చాలా మంది హీరోలకు వినిపించాడు. చివరికి యంగ్ హీరో శర్వానంద్ ఈ కథను ఓకే చేశాడట. మహాసముద్రం సినిమా స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గితే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మొదటి సినిమాలో హీరోయిన్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించిన దర్శకుడు అజయ్ భూపతి “మహాసముద్రం”లో ఏకంగా హీరోను కాస్త నెగటివ్ గా చూపించబోతున్నాడట. రెండవ సినిమాకు కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో అన్నది చూడాలి.

Related posts