telugu navyamedia
సినిమా వార్తలు

మోడీకి షారుఖ్ ఖాన్ శుభాకాంక్షలు

Sharukh

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండవసారి ఘన విజయం సాధించిన నరేంద్రమోదీని బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ అభినందించారు. “మేం పనిచేసే వారికి పట్టం కడుతూ భారతీయులుగా గర్వపడేలా స్పష్టమైన తీర్పునిచ్చాం. ప్రజాస్వామ్యంలో ఘన విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీ నేతలకు అభినందనలు” అంటూ షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీ ప్రశంసిస్తూ బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, శిల్పాశెట్టి, రవీనాటాండన్, పరిణితీ చోప్రా, వరుణ్ ధావన్, కరణ్ జోహార్ లు అభినందనల వర్షం కురిపించారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా సూపర్ స్టార్ లాంటి నటీనటులు మోడీకి అభినందనలు తెలిపారు.

Related posts