telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్ఆర్ఆర్ టీం…

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై దర్శకుడు టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ పూతిన రోజు సందర్బంగా ఈ పోస్టర్ ను విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్.. విల్లు పట్టుకొని.. పౌరుషత్వంతో కనిపించాడు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది.

Related posts