telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బిగ్‌ బ్రేకింగ్‌ : అచ్చెన్నాయుడు అరెస్ట్‌

achennayudu tdp

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో అచ్చెన్నాయుడుని కాసేపటి క్రితమే అరెస్ట్‌ చేశారు. నిన్న కోటబొమ్మాళి పీఎస్‌లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదైన నేపథ్యంలో ఇవాళ అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన అచ్చెన్నాయుడిని కోటబొమ్మాళి పీఎస్‌కు తరలించారు పోలీసులు. దీంతో నిమ్మాడలో టెన్షన్‌ వాతావారణం నెలకొంది. అటు అప్పన్నను పరామర్శించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు. 

Related posts