telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవార్డు రాలేదని మధ్యలోనే లేచి… స్టార్ హీరో ఆగ్రహం

Shahid-Kapoor

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించిన ‘కబీర్‌సింగ్’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఎంత భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించిందో.. అంతే స్థాయిలో విమర్శలనూ మూటకట్టుకుంది. అయినప్పటికీ షాహిద్ కపూర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ సినిమా 2019లో హిట్ అయిన సినిమాల జాబితాలో చేరింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షాహిద్ కపూర్ ఒక అవార్డుల ఫంక్షన్‌కు హాజరయ్యారు. అయితే ‘కబీర్ సింగ్’లో నటనకు గాను అతనికి ఎటువంటి అవార్డు రాలేదు. దీంతో ఆగ్రహించిన షాహిద్ కపూర్ అవార్డుల ఫంక్షన్ మధ్యలోనే లేచివెళ్లిపోయారని సమాచారం. ఇంతేకాకుండా ఈ ఈవెంట్‌లో డాన్స్ చేసేందుకు కూడా నిరాకరించారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ కంగుతిన్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం షాహిద్‌ కపూర్ ‘జెర్సీ’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts